Advertisement

ఉరి వేసుకొని ఒకరి మృతి

Jan 17 2021 @ 00:40AM
ఉరి వేసుకొని మృతి చెందిన రాజేశ్వర్‌

సారంగాపూర్‌, జనవరి 16 : మండలంలోని ఆలూర్‌ గ్రామ సమీపంలో శనివారం చెట్టుకు ఉరి వేసుకొని లోలం రాజేశ్వర్‌(40) అనే వ్యక్తి మృతి చెంది నట్లు ఎస్సై రాం నర్సింహరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాజేశ్వర్‌ గత కొన్ని రోజుల నుండి తాగుడికి బానిసై పొలం పనులు చేయలేక ఆగయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని పేర్కొన్నారు. 

Follow Us on:
Advertisement