Somireddy Chandramohan Reddy : ఏపీలో దిగజారుడు రాజకీయాలు ..దుర్మార్గపు పరిపాలన

ABN , First Publish Date - 2022-09-23T01:34:22+05:30 IST

Prakasham: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) మంత్రులు దిగజారుడు రాజకీయాలు పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పాలన గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

Somireddy Chandramohan Reddy : ఏపీలో దిగజారుడు రాజకీయాలు ..దుర్మార్గపు పరిపాలన

Prakasham: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) మంత్రులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పాలన గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.


‘‘ గతంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. ఆయన కొడుకు అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ పేరు తొలగించాడు. ప్రభుత్వాలు మారితే సంస్థల పేర్లు మారుస్తారా? నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, అంబేద్కర్, జగజీవన్ రామ్‌ పేర్ల విషయంలో ఇలానే చేస్తారా? వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.జగన్ తప్ప ఏ  ముఖ్యమంత్రి కూడా పత్రికలు, మీడియా, కులాల గురించి శాసన సభలో మాట్లాడలేదు. ఎన్టీఆర్ ముందు జగన్ ఒక బచ్చా..రైతులకు 18 గంటలు విద్యుత్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నియోజకవర్గాల్లో చిన్న వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే అనుగ్రహం కావాలి. చీమకుర్తి లాంటి ప్రాంతాల్లో గ్రానైట్ వ్యాపారం చెయ్యాలంటే జగన్ కనుసన్నల్లో చెయ్యాలి. లేకపోతే కోర్టులకు వెళ్లి కాపాడు కోవాలి. నెల్లూరు సిలికా శ్యాండ్ నుంచి ఇడుపులపాయ అకౌంట్‌కి ప్రతి నెల రూ.30 కోట్ల నుంచి రూ. 40 కోట్లు వెళ్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది.’’ అని సోమిరెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2022-09-23T01:34:22+05:30 IST