మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సోమిరెడ్డి

Nov 19 2021 @ 12:39PM

అమరావతి: మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం శుభపరిణామమన్నారు. రాజకీయాల్లో కానీ, ప్రభుత్వాధినేతల్లో కానీ పట్టువిడుపులు ఉండాలనేందుకు ఇదొక నిదర్శనమన్నారు. కాస్త ఆలస్యమైనప్పటికీ రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషమన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.