
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ పోలవరం జపమే తప్ప.. రాష్ట్రంలో ఇతర సాగు నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు ఎకరాలున్న రైతు సంతోషంగా జీవిస్తుంటే...ఉత్తరాంధ్రలో అంతకంటే ఎక్కువ భూములున్న రైతులు కూడా వలస కూలీలుగా జిల్లా విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం తామేనని వీర్రాజు స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి