
విజయవాడ: అల్లుడి విషయంపై బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. నాకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరే అల్లుళ్ళు అని తెలిపారు. తాను పెళ్లి చేయలేదు, మా అమ్మాయి పెళ్లిచేసుకుని వెళ్లిందన్నారు. తాను కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదన్నారు. అతని కేరెక్టర్ నాకు నచ్చలేదని, తాను తనని అల్లుడిగా స్వీకరించలేదని చెప్పారు. గతంలో ఆయనపై తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోలేదన్నారు. ఆయనతో తనకు సంబంధం లేదన్నారు. దయచేసి తన పేరు ప్రస్తావించొద్దని మనవిచేస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి