
అమరావతి: జగన్ ప్రభుత్వం రైతులకు బీమా ప్రీమియం చెల్లించలేదని బీజేపీ నేత సోమువీర్రాజు అన్నారు. ఒక్క రూపాయి కడితేచాలని చెప్పి రైతుల కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్ భీమా యోజన ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై జగన్ సమీక్షలకే పరిమితమయ్యారని విమర్శించారు. నీటిపారుదల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పంట కాలువల ఆదునీకరణను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అలాగే ఏపీ ప్రభుత్వం కాలువల మరమ్మతులు కూడా చేపట్టడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి