Advertisement

బీజేపీలో బీసీలకు పెద్దపీట: సోము వీర్రాజు

Feb 23 2021 @ 15:30PM

అమరావతి: తమ పార్టీలో బీసీలకు బీజేపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోము వీర్రాజును బీసీ విద్యాధికుల జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ బీజేపీలో బీసీలకు పెద్దపీట వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కులాల వారీగా జనాభా రిజర్వేషన్లు, దామాషా ప్రకారం టికెట్లు కేటాయిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ప్రమోషన్లు, రిజర్వేషన్లలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని వీర్రాజు పేర్కొన్నారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.