Somu Veerraju: ఏపీ భవిష్యత్తు అంథకారంగా మారింది..

ABN , First Publish Date - 2022-09-18T18:41:42+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆదివారం విశాఖ నుంచి రాజాపూర్ బస్సు యాత్రను ప్రారంభించారు.

Somu Veerraju: ఏపీ భవిష్యత్తు అంథకారంగా మారింది..

విశాఖపట్నం (Visakha): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆదివారం విశాఖ నుంచి రాజాపూర్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈరోజు విశాఖ నుంచి ఐదు వేల ప్రజా పోరు సభలను ప్రారంభిస్తున్నామని బీజేపీ నేతలు జీవీఎల్ (GVL), విష్ణుకుమార్ రాజు (Vishnukumar raju), ఎమ్మెల్సీ మాధవ్ (Madhav) అన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) భవిష్యత్తు, అంథకారమయంగా మారిందన్నారు. కుటుంబ పార్టీలు, దిశ దశ లేకుండా పాలన చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు.. ట్రేడింగ్ జరుగుతోందన్నారు. రెండు కుటుంబ పార్టీలు బీజేపీతో దోబూచులాడుతున్నాయని, డ్రామాలాడుతున్నాయన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని ఉందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు ఉంటున్నారు.. వాల్తేర్ క్లబ్, బే పార్క్, రాజధానా?.. భూములిచ్చిన రైతులను రోడ్డుమీద పడేశారని, దీనికి ఎవరు బాధ్యులన్నారు. గత ప్రభుత్వం రాజధాని కట్టలేదు.. ఈ ప్రభుత్వం పని చేయలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు... వైసీపీ, టీడీపీలు, వాష్  అవుట్ అవుతాయన్నారు. పోలవరంపై విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలని, మూడేళ్లలో విశాఖపట్నంలో ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-18T18:41:42+05:30 IST