రాబోయే రోజుల్లో ఏపీలో కూడా నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే జరుగుతుంది: సోము వీర్రాజు

Published: Thu, 10 Mar 2022 13:50:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon

విజయవాడ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించామని, పంజాబ్‌లో కూడా ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేశామని బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇది భారతీయ ప్రజా విజయమన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో రెండో స్థానంలోకి తీసుకెళ్ళేలా ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. నరేంద్రమోదీ చెబితే రష్యా యుద్ధం ఆపిందన్నారు. ఏపీలో రాజకీయ నాయకులు మోదీని విరుద్ధంగా తీసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఏపీలో కూడా నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే జరుగుతుందన్నారు.


మోదీ బియ్యానికి ముప్ఫై మూడు రూపాయలిస్తున్నారని, నితిన్ గడ్కరీ రోడ్లు రయ్ రయ్ అంటాయని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్లను పట్టించుకోవడంలేదని విమర్శించారు. గ్రామ సభల్లో మోదీ ఇప్పటి వరకూ ఇచ్చిన నిధులు, పధకాలు చెపుతామన్నారు. ఓటు కుండలను పక్కకు పెట్టి ఓటు బ్యాంకు సిద్ధం చేస్తున్నామని, ఏపీలో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. 2024 ఎన్నికలో దేశ వ్యాప్తంగా మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.