
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతాంగ సమస్యలపై పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ‘జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు’ యాత్రలో భాగంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు పత్రికల్లో ప్రకటనలపై వున్న శ్రద్ధ... రైతుల సమస్యల పరిష్కారంలో లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిని, వ్యవసాయం కలిసిరాకపోవడంతో రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే సాగునీటి ప్రాజెక్టులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి