విశాఖ: ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌కు బీజేపీ నేత సోమువీర్రాజు లేఖ రాశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల.. పాత వీడియోని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రూట్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాగాణి భూములు ఎడారిని తలపిస్తున్నాయని, పునరావాస ప్యాకేజీలు, ప్రాజెక్టుల నిర్మాణాలు లేవని దుయ్యబట్టారు. వంశధార, నాగావళి నదులను ఎందుకు అనుసంధానించడం లేదు? అని సోమువీర్రాజు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి