వైసీపీ తుగ్లక్ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-04-16T22:50:40+05:30 IST

వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ తుగ్లక్ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు

అమరావతి: వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం ఈ మేరకు పార్టీ ఆఫీసు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే  ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి గత సంవత్సరం ఇవ్వలేదు..ఈ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు.300 యూనిట్లు విద్యుత్ ప్రామీణకం పెడితే ఎలా అని ప్రశ్నించారు.ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు.. ఈ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి  రాదన్నారు. అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సోమువీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.

Updated Date - 2022-04-16T22:50:40+05:30 IST