పార్వతీపురం: తోటపల్లి జలాశయాలను బీజేపీ నేతలు సోమువీర్రాజు, జీవీఎల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. 40 కోట్లు ఖర్చు పెడితే 20వేల ఎకరాలకు.. నీరందించవచ్చనే జ్ఞానం కూడా జగన్కు లేదన్నారు. చిన్నచిన్న డ్యాములు పూర్తిచేయాలనే బుద్ధి కూడా లేదని చెప్పారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ.. సీఎం జగన్ వారం రోజుల మద్యం అక్రమ సంపాదన పక్కన పెడితే.. తోటపల్లి వంటి ప్రాజెక్టుల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. ఈ ప్రాంత సమస్యలపై ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడరని జీవీఎల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి