రూ.13 లక్షలు పోయాయని మామతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లుడు.. చివరకు తేలిందేమిటంటే..

ABN , First Publish Date - 2022-03-10T05:44:01+05:30 IST

అతను తన అత్తమామలపై కోపం పెంచుకున్నాడు. వారికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.. ఇంట్లో ఎవరూ లేనపుడు రూ.13 లక్షలు కాజేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మామతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు..

రూ.13 లక్షలు పోయాయని మామతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లుడు.. చివరకు తేలిందేమిటంటే..

అతను తన అత్తమామలపై కోపం పెంచుకున్నాడు. వారికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.. ఇంట్లో ఎవరూ లేనపుడు రూ.13 లక్షలు కాజేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మామతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయం తేల్చారు. 


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలోని విద్యాధర్ నగర్‌కు చెందిన వివేక్ గుప్తా అనే వ్యక్తికి నెల రోజుల కిందట తన అత్తమామలతో, బావమరిదితో గొడవ జరిగింది. తను అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వారిపై వివేక్ కసి పెంచుకున్నాడు. వారికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అత్తమామలు ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వెళ్లి దొంగ తాళంతో తలుపులు తెరిచాడు. బీరువాలో ఉన్న రూ.13 లక్షలను కాజేశాడు. 


ఆ తర్వాత మామ, బావమరిదితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చోరీ గురించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఫుటేజ్ ద్వారా చోరీకి పాల్పడింది వేవేక్ అని తేలింది. అత్తమామలకు బుద్ధి చెప్పేందుకే చోరీకి పాల్పడ్డానని వివేక్ చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-03-10T05:44:01+05:30 IST