కెనడా వెళ్లి ప్రయోజకుడు అవుతాడనుకుంటే కన్న తండ్రినే చంపేశాడు!

ABN , First Publish Date - 2021-04-18T19:08:32+05:30 IST

ఉన్నత చదువుల కోసం ఆ తండ్రి కష్టార్జితాన్ని అంతా పెట్టి కొడుకును కెనడా పంపించాడు. గొప్పగా...

కెనడా వెళ్లి ప్రయోజకుడు అవుతాడనుకుంటే కన్న తండ్రినే చంపేశాడు!

  • తండ్రిని చంపిన కొడుకు
  • మద్యం డబ్బుల కోసం దారుణం
  • పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో ఘటన

హైదరాబాద్/పెన్‌పహాడ్‌ : ఉన్నత చదువుల కోసం ఆ తండ్రి కష్టార్జితాన్ని అంతా పెట్టి కొడుకును కెనడా పంపించాడు. గొప్పగా చదివి ప్రయోజకుడు కావాలని ఆశపడ్డాడు. అతడి ఆశలు కొన్ని నెలల్లోనే ఆవిరయ్యాయి. విదేశాలకు వెళ్లిన కొడుకు అక్కడ వ్యసనాలకు బానిసయ్యాడు. ఏడాదిన్నరలో రూ.24 లక్షల అప్పులు చేసి కెనడా నుంచి ఇంటి ముఖంపట్టాడు. ఆ అప్పులు తీర్చేందుకు తండ్రి ఉన్న రెండు ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. ఇప్పుడు వ్యసనాలను వదులుకోలేక తండ్రినీ బలితీసుకున్నాడు. ఇది తండ్రిని చంపిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో నంద్యాల అంజిరెడ్డి(70) కుమారుడు అమర సింహారెడ్డి పరిస్థితి. ఎదిగిన కొడుకును చూసి మురిసిపోవాల్సిన తండ్రి అతడిని చూస్తేనే భయపడేవాడు. వ్యసనాల కోసం ఎంతటికైనా తెగిడ్చే మానసిక స్థితికి చేరిన అమరనరసింహారెడ్డి గురించి గ్రామస్థులు తలోరకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటి వైపు చూస్తే చాలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడని, నోటికొచ్చినట్లు తిడతాడని చెబుతున్నారు.


తండ్రిని చంపిన తర్వాత తాపీగా ఇంటికెళ్లి అక్కడే ఉన్నాడు. తండ్రిని చంపిన బాధ అతడి లో ఏమాత్రం లేదని, పైగా ఎప్పుడో చంపుదామనుకున్నా.. ఇప్పుడు కుదిరింది.. అని అతడు అంటున్న మాటలు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం కోసం డబ్బులు కావాలని తండ్రిని తరుచూ వేధించేవాడని చెబుతున్నారు. ఇదే క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా మద్యం డబ్బుల కోసం ఇబ్బంది పెడుతుండటంతో బయటకు వెళ్లేందుకు అంజిరెడ్డి ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు. కొ డుకు చేసిన అప్పుల కోసం ఉన్న రెండు ఎకరాల పొలాన్ని అమ్మిన అంజిరెడ్డి, ప్రస్తుతం తన ఖర్చుల కోసం పింఛన్‌పై ఆధారపడేవాడని గ్రామస్థులు తెలిపారు. చేతికెదిగిన కొడుకు ఉన్నా కూతురి సాయాన్ని కోరాల్సిన పరిస్థితిపై చెప్పుకుని బాధపడేవాడని వివరించారు.

Updated Date - 2021-04-18T19:08:32+05:30 IST