ఇంటి దొంగ..కన్న కొడుకే..!

ABN , First Publish Date - 2021-06-23T06:46:57+05:30 IST

కన్న కొడుకే ఇంటి దొంగగా మారాడు. మొక్కు తీర్చుకు నేందుకు దాచిన బంగారం, నగదు చోరీ చేయడంతో తం డ్రి పోలీసులు ఫిర్యాదు చేయ గా కేసును 24 గంటల్లోనే ఛే దించారు. మంగళవారం సా యంత్రం మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు రూరల్‌ సీఐ ఆ ర్‌.రాంబాబు కేసు వివరాలను వెల్లడించారు.

ఇంటి దొంగ..కన్న కొడుకే..!
కేసు వివరాలను వెల్లడిస్తున్న పోలీసులు

8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1.30లక్షల నగదు చోరీ

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు 


మద్దిపాడు, జూన్‌ 22 : కన్న కొడుకే ఇంటి దొంగగా మారాడు. మొక్కు తీర్చుకు నేందుకు దాచిన బంగారం, నగదు చోరీ చేయడంతో తం డ్రి పోలీసులు ఫిర్యాదు చేయ గా కేసును 24 గంటల్లోనే ఛే దించారు. మంగళవారం సా యంత్రం మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు రూరల్‌ సీఐ ఆ ర్‌.రాంబాబు కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన దాడి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వేకువజామున ఇంటి తాళం తెరచి బీరువాలోని 8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1.30లక్షల నగదును గుర్తుతెలి యని వ్యక్తులు చోరీ చేశారని మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఐ వై.నాగరాజు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమా చారం అందించారు. ఒంగోలు డీఎస్పీప్రసాద్‌, సీఐ రాంబాబు సంఘటనా స్థలా నికి క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. ఈక్రమంలో బాధితుల కుమారుడు రాఘవరావు నిందితుడిగా గుర్తించారు.  కాగా రాఘవరావు బీటెక్‌ చదువుకొని బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గత ఎనిమిది సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపో యాడు. కుమారుడు వెళ్లి పోయాడన్న దిగులుతో తల్లిదండ్రులు తమ బిడ్డ ఇంటికివస్తే ఎనిమిది సవర్లు బంగారు ఆభరణాలు తిరుపతి వేంకటేశ్వరస్వామి హుండీలో వేస్తామని మొక్కుకున్నారు. నెలక్రితం రాఘవరావు ఇంటికి చేరాడు. మొక్కు విషయాన్ని కుమారుడికి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరుబయట నిద్రి స్తున్న సమయంలో ఇంటిలో ఉన్న బంగారు అభరణాలు, నగదు తస్కరించి తన తగ్గర ఉంచుకుని ఏమీ తెలియనట్లు నటించాడు. విచారణలో దొరికిన ఆ ధారాలతో నిందితుడు రాఘవరావును పోలీసులు విచారించగా చోరీకి పాల్పడి నట్లు ఒప్పుకున్నాడు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బంది బొట్టు వెంకటేశ్వర్లు, అనిల్‌లను డీఎస్పీ ప్రసాద్‌ అభినందించారు. 


Updated Date - 2021-06-23T06:46:57+05:30 IST