సౌత్‌పై కన్నేసిన సోనమ్ కపూర్..?

Jun 11 2021 @ 11:31AM

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సోనమ్ కపూర్ సౌత్ సినిమాలలో అవకాశాలు అందుకోవాలని ట్రై చేస్తోందట. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశం వస్తే ఎస్ చెప్పాలనుకుంటుందట. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తున్నారు. త్వరలో కియారా అద్వానీ టాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగుతోంది. శ్రద్దా కపూర్ 'సాహో'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్‌తో దీపిక పడుకొణ్ ఎంట్రీ ఇస్తోంది. ఊర్వశి రౌతెలా 'బ్లాక్ రోజ్' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో సోనమ్ కపూర్ కూడా ఇక్కడ అవకాశల కోసం ఆరాటపడుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈమెకి ముందు తెలుగులో అవకాశం వస్తుందా లేక తమిళ ఇండస్ట్రీ ఛాన్స్ ఇస్తుందా. సోనమ్ ప్రస్తుతం షోమ్ ముఖర్జీ దర్శకత్వంలో 'బైండ్' అనే సినిమాలో నటించబోతోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.