Shocking: భార్య ప్రవర్తనతో విసిగిపోయి మామగారి ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-09-18T22:49:36+05:30 IST

ఆ వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన కొన్ని నెలల వరకు భార్య అతడితో బాగానే ఉంది..

Shocking: భార్య ప్రవర్తనతో విసిగిపోయి మామగారి ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ తర్వాత..

ఆ వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన కొన్ని నెలల వరకు భార్య అతడితో బాగానే ఉంది.. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.. ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయేది.. ఆ తర్వాత భర్త బతిమాలితే తిరిగి వెళ్లేది.. నాలుగేళ్లుగా భర్తను వదిలి పూర్తిగా పుట్టింటికే పరిమితమైంది.. వారం రోజుల క్రితం మరో వ్యక్తిని ద్వితియ వివాహం చేసుకుని వెళ్లిపోయింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త కొందరు వ్యక్తులతో కలిసి మామపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రాజస్థాన్‌ (Rajasthan)లోని బార్మర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Cyber Crime: కేవలం రూ.10తో కోట్లు వచ్చేస్తాయనే ఆశ.. రూ.27 లక్షలు కోల్పోయిన జైపూర్ వాసి.. ఎలా జరిగిందంటే..


బార్మర్ జిల్లా సోండికి చెందిన నారాయణ్ రామ్‌కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కొంత కాలం భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్య తరచుగా అలిగి పుట్టింటికి వెళ్లిపోయేది. గత 4 సంవత్సరాలుగా ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. చివరకు భర్తతో కలిసి జీవించడానికి నిరాకరించి మరొక వ్యక్తితో వివాహానికి అంగీకరించింది. దీంతో ఆమె తండ్రి సుఖ్‌రామ్ ఆమెకు ఐదు రోజుల క్రితం మరొక వ్యక్తితో వివాహం జరిపించి పంపించాడు. 


ఆ విషయం రామ్‌కు తెలిసింది. తన భార్యకు రెండో వివాహం చేశాడనే కారణంతో మామ సుఖ్‌రామ్‌పై పగబట్టాడు. పది మంది వ్యక్తులను తీసుకుని మామ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశాడు. చాకుతో అతని ముక్కు, చెవులు కోసేశాడు. అంతేకాదు ఓ కాలు కూడా విరిచేశాడు. స్థానికులు సుఖ్‌రామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుఖ్‌రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్‌తో పాటు మరొకర వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-09-18T22:49:36+05:30 IST