సోనూ సూద్‌కు గోల్డెన్ వీసా.. !

ABN , First Publish Date - 2022-04-08T02:24:41+05:30 IST

సినీ యాక్టర్, రియల్ హీరో సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసా జారీ చేసింది.

సోనూ సూద్‌కు గోల్డెన్ వీసా.. !

ఎన్నారై డెస్క్: సినీ యాక్టర్, రియల్ హీరో సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసా జారీ చేసింది. దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టే పెద్ద ఇన్వెస్టర్లకు, వ్యాపారవేత్తలకు, తమ రంగాల్లో నిష్ణాణుతులుగా పేరు ప్రఖ్యాతులు పొందిని వారికి మాత్రమే ఇచ్చే వీసాతో సోనూ సూద్‌ను సత్కరించింది. కాగా.. తనకు గోల్డెన్ వీసా వచ్చిన విషయాన్ని ఆయన స్వయంగా సోషల్  మీడియాలో వెల్లడించారు.  ఈ వీసా లభించడం తనకెంతో సంతోషం కలిగించిందన్న ఆయన.. తనకు నచ్చిన పర్యాటక ప్రదేశాల్లో దుబాయ్ కూడా ఒకటని పేర్కొన్నారు. గతంలో ప్రముఖ సినీ యాక్టర్లు షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ షెట్టీ కూడా గోల్డెన్ వీసా పొందారు. 

Updated Date - 2022-04-08T02:24:41+05:30 IST