రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి మాల్విక సూద్

ABN , First Publish Date - 2021-11-14T21:19:10+05:30 IST

నిజానికి సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారని ఏడాదిపైగా ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో సోనూను ఈ విషయమై ప్రశ్నించినప్పటికీ తనకు అలాంటి ఆలోచనలు లేవని కొట్టిపారేశారు. ఇదే తరుణంలో సోదరి రాజకీయ ప్రవేశం చేస్తుండడంతో..

రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి మాల్విక సూద్

ముంబై: తన సోదరి మాల్విక సూద్ సచార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సినీ నటుడు, ప్రముఖ సామాజికవేత్త సోనూ సూద్ ప్రకటించారు. పంజాబ్ నుంచి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారని, అయితే ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తామని ఆయన అన్నారు. ఆదివారం పంజాబ్‌లోని మోగాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.


‘‘మాల్విక రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రజాసేవలో తన అసమానమైన కృషిని ఇచ్చేందుకు ఆమె కృతనిశ్చయంతో ఉంది’’ అని సోనూ సూద్ అన్నారు. కాగా, సోనూ సూద్ ఇటీవలె పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని కలుసుకున్నారు. దీంతో మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇదే సమావేశంలో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను సైతం కలుసుకున్నారు.


నిజానికి సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారని ఏడాదిపైగా ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో సోనూను ఈ విషయమై ప్రశ్నించినప్పటికీ తనకు అలాంటి ఆలోచనలు లేవని కొట్టిపారేశారు. ఇదే తరుణంలో సోదరి రాజకీయ ప్రవేశం చేస్తుండడంతో.. సోనూ కూడా త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతారని అంటున్నారు.

Updated Date - 2021-11-14T21:19:10+05:30 IST