
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా `క్రాక్`. సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటవ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను నటుడు సోనూ సూద్ హిందీలోకి రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పవర్ఫుల్ పోలీసాఫర్ పాత్రతో బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సోనూ అనుకుంటున్నాడట. రీమేక్ హక్కుల కోసం `క్రాక్` నిర్మాత ఠాగూర్ మధుతో సోనూ సంప్రదింపులు జరుపుతున్నాడట. ఈ సినిమాను సోనూ స్వయంగా నిర్మించబోతున్నట్టు సమాచారం. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.