ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి కారణంగా ఆ పార్టీ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడంతో మోదీ హవా ఏమాత్రం తగ్గలేదన్నది స్పష్టమవుతున్నది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాట్–ముస్లింలకు మధ్య జరిగిన ముజఫర్నగర్ అల్లర్ల చేదు ఘటన నేటికీ అక్కడి ప్రజల మదిలో నిలిచిపోయింది. ఆ రెండు వర్గాల వారిని మరిపించి ఓట్లను కొల్లగొట్టాలని అఖిలేష్ యాదవ్ విశ్వప్రయత్నమే చేశారు. కానీ నాటి దురదృష్ట ఘటన నుంచి కోలుకోని ప్రజలు సమాజ్వాదీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ అనుసరించిన వ్యూహాలనే తెలంగాణ రాష్ట్రంలోనూ అమలుపర్చాలని, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళి తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ భావిస్తుంది. తెలంగాణలో వ్యుహలు రచించే పనిలో భాగంగా ఈ నెల చివరలో పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా, వచ్చే నెలలో హోంమంత్రి అమిత్షా తెలంగాణకు రానున్నారు. వీరి రాకతో బీజేపీ మరింత బలం పుంజుకొని తెలంగాణలోనూ గెలుపు సాధించటం తథ్యం.
దుగ్యాల ప్రదీప్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీజేపీ తెలంగాణ