Delhi to London బస్సు యాత్ర...70 రోజుల్లో 18 దేశాల మీదుగా పర్యటన

ABN , First Publish Date - 2022-02-17T17:29:49+05:30 IST

ఇకనుంచి న్యూఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో ప్రయాణించడానికి కొత్త బస్సు సర్వీసు ప్రారంభం కానుంది...

Delhi to London బస్సు యాత్ర...70 రోజుల్లో 18 దేశాల మీదుగా పర్యటన

న్యూఢిల్లీ: మనం విదేశాలకు వెళ్లాలని అనుకున్నప్పుడల్లా విమాన ప్రయాణం గురించే మనం ఆలోచిస్తుంటాం... కానీ దీనికి భిన్నంగా ఇకనుంచి న్యూఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో ప్రయాణించడానికి కొత్త బస్సు సర్వీసు ప్రారంభం కానుంది.న్యూఢిల్లీ నుంచి లండన్ నగరం వరకు 70 రోజుల్లో 18 దేశాల మీదుగా 20,000కిలోమీటర్ల దూరం లగ్జరీ బస్సు యాత్ర సెప్టెంబరు నెలలో ప్రారంభం కానుంది. 18 దేశాలను చుట్టేలా ఉద్ధేశించిన లండన్ యాత్ర చేసే ప్రయాణికులు లండన్ ప్రయాణాన్ని ఆస్వాదించనున్నారు.బస్సు టికెట్, వీసాలు, విదేశాల్లో బస, అన్ని సేవలను కలిపి ఈ లగ్జరీ బస్సు యాత్ర చార్జీ రూ.15 లక్షలని ప్రకటించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు భోజనం, మద్యం అందిస్తారు. బస్సులోనే 20 సీట్లతో ప్రయాణికులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు.


ఈ బస్సు సర్వీస్ మయన్మార్, థాయ్ లాండ్, చైనా, కిర్గిస్థాన్ మీదుగా ఫ్రాన్స్‌కు ప్రయాణిస్తుంది. ఇంగ్లీష్ ఛానెల్‌లను కవర్ చేయడానికి క్రూయిజ్ షిప్ కూడా ఉపయోగించనున్నారు. ఫ్రాన్స్‌లోని కాల్ నుంచి యూకేలోని డోవర్‌కి వెళ్లడానికి ఫెర్రీ కూడా ఉపయోగించనున్నారు.65 సంవత్సరాల క్రితం బ్రిటీష్ బస్ కంపెనీ ఆల్బర్ట్ టూర్స్ ఈ బస్సు సర్వీస్ ప్రారంభించింది. ఇది 1957లో ప్రారంభమైంది.ఆ యాత్రలో కోల్‌కతాను ఢిల్లీ మీదుగా లండన్‌కు అనుసంధానించింది. ఈ డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ 1976వ సంవత్సరం వరకు నడిచింది. అయితే కొన్ని ప్రమాదాలు,పలు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలతో బస్సు యాత్ర నిలిచిపోయింది. మరి ఇన్నేళ్లకు మళ్లీ న్యూఢిల్లీ-లండన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.


Updated Date - 2022-02-17T17:29:49+05:30 IST