జొన్నల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-23T05:04:48+05:30 IST

తక్కువ ధరకు తెల్లజొన్నలు తెచ్చి పచ్చజొన్నలుగా మార్చి అమ్ముతున్న ముఠాను శనివారం పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

జొన్నల ముఠా అరెస్ట్‌
పట్టుబడిన నిందితులు, జొన్నలతో పోలీసులు

- కేసు నమోదు  - జొన్నలు సీజ్‌


పెబ్బేరు, జనవరి 22 : తక్కువ ధరకు తెల్లజొన్నలు తెచ్చి పచ్చజొన్నలుగా మార్చి అమ్ముతున్న ముఠాను శనివారం పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధర్మ వరంలో తెల్లజొన్నలు తక్కువ ధరకు కొనుగోలు చేసి పెబ్బేరు పట్టణానికి తీసుకువచ్చి కంచిరావుపల్లి గ్రామ శివారులో వాటిని కెమికల్‌ సహాయంతో పచ్చ జొన్నలుగా మార్చుతుండగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకు న్నట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం కు చెందిన బానోతు ప్రసాద్‌నాయక్‌, వెంకటేష్‌నాయక్‌, మూడవత్‌ సేననా యక్‌లపై కేసు నమోదు చేసి వారు వాడిన ఆటో, 13 క్వింటాళ్ల జొన్నలను, పసుపురంగు కెమికల్‌ను స్వాధీనపర్చుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పెబ్బేరు ఎస్సై బి.రామస్వామి వివరించారు. జొన్నలను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2022-01-23T05:04:48+05:30 IST