ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సాయిడ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా ఓ భారతీయుడి నియామకం..!

ABN , First Publish Date - 2022-01-17T01:59:43+05:30 IST

భారతీయ సంతతికి చెందిన సౌమిత్రా దత్తా ఆక్సఫర్డ్ యూనివర్శిటీలోని సాయిడ్ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గా ఎంపికయ్యారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సాయిడ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా ఓ భారతీయుడి నియామకం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆక్సఫర్డ్ యూనివర్శిటీలోని సాయిడ్ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గా భారతీయ సంతతికి చెందిన సౌమిత్రా దత్తా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తాజాగా ప్రకటించింది. భారత్‌లోనే జన్మించిన సౌమిత్ర దత్తా.. కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన.. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్‌లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం అనుభవం కలిగిన ఆయన..ప్రస్తుతం కార్నెల్ యూనివర్శిటీలోని జాన్సన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2022-01-17T01:59:43+05:30 IST