భారత పర్యాటకులను ఆకర్షించేందుకు.. దక్షిణాఫ్రికా కొత్త వ్యూహం..

ABN , First Publish Date - 2022-03-11T19:06:42+05:30 IST

కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని ఊతమిచ్చేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత పర్యాటకులను ఆకర్షించేందుకు.. దక్షిణాఫ్రికా కొత్త వ్యూహం..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని ఊతమిచ్చేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతియేటా ఆ దేశానికి వెళ్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ-వీసాలు ఇవ్వడం మొదలెట్టింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికన్ టూరిజం హబ్ హెడ్ నెలిస్వా ఎంకని మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి భారతీయులకు ఈ-వీసా సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే భారతీయ ప్రయాణికులకు ప్రాధాన్యతపై పర్యాటక వీసాలను కూడా ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు. ఇక ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య పరంగా టాప్-10 దేశాల జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. భారత్‌లోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణె నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు దక్షిణాఫ్రికాకు వస్తుంటారని నెలిస్వా ఎంకని చెప్పారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం భారత్ నుంచి సౌతాఫ్రికా వెళ్లే ప్రయాణికులు జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించడం తప్పనిసరి. 

Updated Date - 2022-03-11T19:06:42+05:30 IST