
క్రైస్ట్‌చర్చ్: ఉమెన్స్ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళ జట్టు మొదట బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగుల భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు ఓపెన్లరు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ద్వయం 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత షఫాలీ వర్మ(53) రనౌట్‌గా వెనుదిరగడం.. ఆ తర్వాత వన్ డౌన్‌గా క్రీజులోకి వచ్చిన యస్తీక భాటియా(02) కూడా వెంటనే ఔట్ కావడంతో భారత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. యస్తీక నిష్క్రమణ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సారథి మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.
అర్ధశతకంతో అదరగొట్టిన మరో ఓపెనర్ స్మతి మంధాన.. 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరింది. దాంతో 80 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మిథాలీ.. హార్మన్ ప్రీత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడింది. అనంతరం 68 పరుగుల వద్ద ఔటైంది. ఈ ద్వయం 54 పరుగులు జోడించింది. చివరలో హార్మన్(48) తృటిలో అర్ధశతకం చేజార్చుకుంది. చివరగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగుల చేసింది. సఫారీలకు 275 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబత కలాస్ చెరో రెండు వికెట్లు తీస్తే.. ఆయబొంగా ఖాకా, క్లో ట్రయాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ టోర్నీలో నిలకడగా ఆడడంలో విఫలమైన భారత్ మూడు విజయాలు మూడు ఓటములతో మొత్తం 6 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో అవసరం లేకుండా మిథాలీ సేన నేరుగా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది.
ఇవి కూడా చదవండి