డోపింగ్ ఉల్లంఘన.. South African బ్యాటర్‌పై ఐసీసీ నిషేధం

ABN , First Publish Date - 2022-05-18T02:33:58+05:30 IST

దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై ఐఐసీ నిషేధం విధించింది. 9 నెలలపాటు క్రికెట్ సంబంధిత

డోపింగ్ ఉల్లంఘన.. South African బ్యాటర్‌పై ఐసీసీ నిషేధం

దుబాయ్: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై ఐఐసీ నిషేధం విధించింది. 9 నెలలపాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు జుబేర్ అంగీకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 17 జనవరి 2022న అతడు అందించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ (Furosemide) అనే నిషేధిత పదార్ధం ఉన్నట్టు గుర్తించారు. 2022 వాడా (WADA) నిషేధిత జాబిలోని సెక్షన్ ఎస్5లో ఈ పదార్థం ఉంది.


ఈ నేపథ్యంలో అతడిని విచారించగా డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించాడు. దీంతో ఐసీసీ అతడిపై 9 నెలలపాటు నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి 22 నుంచి 9 నెలలపాటు అంటే డిసెంబరు 22వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఆ తర్వాతి నుంచి అతడు తిరిగి క్రికెట్‌లోకి రావొచ్చు. అంతేకాదు, ఈ ఏడాది 17 జనవరి  నుంచి నిషేధం అమల్లోకి వచ్చిన 22 మార్చి వరకు అతడి వ్యక్తిగత ప్రదర్శనలన్నీ అనర్హమైనవిగా ఐసీసీ ప్రకటించింది. దీంతో న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్‌లో ఫిబ్రవరిలో జరిగిన జరిగిన టెస్టు మ్యాచ్‌లో చేసిన 31 పరుగులను హమ్జా కోల్పోతాడు. 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరపున ఆరు టెస్టులు, ఒక వన్డే ఆడాడు. 

Updated Date - 2022-05-18T02:33:58+05:30 IST