భయపెడుతున్న ఆర్‌ఏసీ జర్నీ

ABN , First Publish Date - 2021-01-11T14:09:15+05:30 IST

భౌతికదూరం తప్పనిసరి అని నిబంధన పెట్టిన దక్షిణ మధ్య రైల్వే.. కొన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కొనసాస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో రిజర్వేషన్‌ ఎగెనెస్ట్‌ క్యాన్సిలేషన్‌ (ఆర్‌ఏసీ) ...

భయపెడుతున్న ఆర్‌ఏసీ జర్నీ

ఒకే బెర్తులో ఇద్దరు 

భౌతిక దూరం ఎలా.. అని ఆందోళన


హైదరాబాద్‌ : భౌతికదూరం తప్పనిసరి అని నిబంధన పెట్టిన దక్షిణ మధ్య రైల్వే.. కొన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కొనసాస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో రిజర్వేషన్‌ ఎగెనెస్ట్‌ క్యాన్సిలేషన్‌ (ఆర్‌ఏసీ) టికెట్లు తీసుకుని ప్రయాణికులు ఒకే బెర్తులో ఇద్దరు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో కూడా ఆర్‌ఏసీల ద్వారా వందలాది మంది ప్రయాణం చేసి ఇబ్బందులు పడ్డారు. తాజాగా సంక్రాంతి నేపథ్యంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. 


ఈ రైళ్లలో ఆర్‌ఏసీలు ఫుల్‌..

హైదరాబాద్‌-ఔరంగాబాద్‌, కడప-విశాఖపట్నం, లింగంపల్లి-తిరుపతి, లింగంపల్లి-కాకినాడపోర్టు, తిరుపతి- అమరావతి, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌, తిరుపతి - భువనేశ్వర్‌, కేఎ్‌సఆర్‌బెంగళూరు - నాందేడ్‌, కాచిగూడ-మైసూర్‌, లక్నో - యశ్వంతాపూర్‌తో పాటు మరికొన్ని రైళ్లలో వారం రోజులుగా వందకు పైగా సీట్లు ఆర్‌ఏసీయే చూపుతున్నాయి. రిజర్వేషన్‌ చార్టు ప్రిపేర్‌ అయిన తర్వాత కన్‌ఫాం కాకపోవడంతో చాలామంది ఆర్‌ఏసీల ద్వారానే ప్రయాణిస్తున్నారు. ఉదాహరణకు ఒక కోచ్‌లో 5 స్లీపర్‌ బోగీలుంటే వాటిలోని సైడ్‌ లోయర్‌ సీట్లలో ఇద్దరు చొప్పున ఆర్‌ఏసీ పాసింజర్లు కూర్చోవడంతో వారు భయానికి గురికావాల్సి వస్తోంది. ఇలా కూర్చోవడం ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశముందని పలువురు వాపోతున్నారు. స్టేషన్లలో తూతూమంత్రంగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తుండడంతో కొవిడ్‌ బాధితులు సైతం ఆర్‌ఏసీ టికెట్లు పొంది రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-11T14:09:15+05:30 IST