CM's visit: దక్షిణ జిల్లాల్లో 12 నుంచి మళ్లీ సీఎం పర్యటన

ABN , First Publish Date - 2022-09-11T16:18:36+05:30 IST

దక్షిణ జిల్లాలకు వెళ్లి శుక్రవారం చెన్నై చేరుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), వచ్చే వారం మూడు రోజులు మళ్లీ ఆ జిల్లాలకు

CM's visit: దక్షిణ జిల్లాల్లో 12 నుంచి మళ్లీ సీఎం పర్యటన

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 10: దక్షిణ జిల్లాలకు వెళ్లి శుక్రవారం చెన్నై చేరుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), వచ్చే వారం మూడు రోజులు మళ్లీ ఆ జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ నెల 12న దిండుగల్‌ జిల్లా వెళ్లే ముఖ్యమంత్రి, అక్కడ ‘తోటనూత్తు’ అనే స్థలంలో శ్రీలంక తమిళుల కోసం నిర్మించిన 321 గృహాలు ప్రారంభించనున్నారు. ఆ రోజు రాత్రి మదురైలో బసచేసి మరుసటిరోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతిని పురస్కరించుకొని మదురై సిమ్మక్కల్‌ సమీపంలోని నెల్‌పేటలో అన్నాదురై(Annadurai) విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించనున్నారు. ఆ విగ్రహం సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే విరుదునగర్‌ చేరుకొని రూ.70కోట్ల వ్యయంతో కలెక్టర్‌ కార్యాల య భవనానికిశంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం డీఎంకే ఆధ్వర్యంలో జరిగే ముప్పెరుం విళాలో పాల్గొని, మరుసటిరోజు మళ్లీ మదురై చేరుకుంటారు. అక్కడ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని చెన్నై తిరిగి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-09-11T16:18:36+05:30 IST