రష్యా మిత్రదేశం బెలారస్‌పై కఠిన ఆంక్షలు: దక్షిణ కొరియా

ABN , First Publish Date - 2022-03-06T21:52:42+05:30 IST

ఇక బెలారస్ విషయమై దక్షిణ కొరియా మంత్రి ఒకరు తాజాగా మాట్లాడుతూ "ఉక్రెయిన్‌పై రష్యా దాడికి బెలారస్ మద్దతు ఇస్తోంది. బెలారస్‌పై కూడా ఎగుమతి నియంత్రణ చర్యలను అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది" అని ఒక ప్రకటనలో..

రష్యా మిత్రదేశం బెలారస్‌పై కఠిన ఆంక్షలు: దక్షిణ కొరియా

సియోల్: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు మద్దతు ఇస్తుందనే కారణంతో బెలారస్‌పై ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమైనట్లు దక్షిణ కొరియా ఆదివారం ప్రకటించింది. ఎలాంటి ఆంక్షలు విధించబోతున్న విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. దాదాపుగా రష్యాపై విధించిన ఆంక్షల్నే బెలారస్‌పై కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో రష్యాకు ఎగుమతులపై దక్షిణ కొరియా నియంత్రణలను కఠినతరం చేసింది. రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేసింది.


ఇక బెలారస్ విషయమై దక్షిణ కొరియా మంత్రి ఒకరు తాజాగా మాట్లాడుతూ "ఉక్రెయిన్‌పై రష్యా దాడికి బెలారస్ మద్దతు ఇస్తోంది. బెలారస్‌పై కూడా ఎగుమతి నియంత్రణ చర్యలను అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది" అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా సైన్యం పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై దాడికి బెలారస్‌ను ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగించుకుంది. ఈ విషయమై బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషంకోను ప్రశ్నించగా తమ దేశానికి చెందిన దళాలు యుద్ధంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు.


రష్యాపై ఇప్పటికే అనేక పాశ్చాత్య దేశాలు, క్రీడా సంస్థలు, పెద్ద కంపెనీలు అనేక ఆంక్షలు విధించాయి. రష్యాను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో మరిన్ని దేశాలు, సంస్థలు ఈ జాబితాలో వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా మరింత ముందడుగు వేసి రష్యాతో పాటు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం.

Updated Date - 2022-03-06T21:52:42+05:30 IST