ఉత్తర కొరియా అలా ఎందుకు చేసిందో చెప్పిన దక్షిణ కొరియా

Published: Thu, 31 Mar 2022 15:06:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉత్తర కొరియా అలా ఎందుకు చేసిందో చెప్పిన దక్షిణ కొరియా

సియోల్ : అమెరికా, దక్షిణ కొరియా, అంతర్జాతీయ సమాజం ముందు తనకు గొప్ప అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉందని చెప్పుకునేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే మార్చి 16న Hwasong-17 ICBM పరీక్ష చేసి, విఫలమైంది. దీంతో దేశంలో ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు మార్చి 24న మరొక ప్రయోగం చేసింది. ఈ రెండో ప్రయోగాన్ని Hwasong-15 ICBMతో చేసినప్పటికీ Hwasong-17 ICBMగా నమ్మించేందుకు ప్రయత్నించిందని దక్షిణ కొరియా చెప్తోంది. అయితే ఈ ప్రయోగం విఫలమవడం గురించి ఉత్తర కొరియా ఎటువంటి ప్రకటన చేయలేదు. 


దక్షిణ కొరియా సైన్యం చెప్తున్నదాని ప్రకారం, ఉత్తర కొరియా పాత, చిన్న ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. అంతేకానీ Hwasong-17 ICBMని కాదు. మార్చి 24న జరిగిన ప్రయోగం Hwasong-15 ICBMకు సంబంధించినదేనని దక్షిణ కొరియా, అమెరికా అధికారులు చెప్తున్నారు. ఈ ప్రయోగంపై విశ్లేషణ జరుగుతోందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ విలేకర్లకు చెప్పారు. 


2017 నవంబరులో Hwasong-15ను ఉత్తర కొరియా మొదటిసారి ప్రయోగించింది. అప్పటికి ICBM testingపై మారటోరియం లేదు. ఇదిలావుండగా, ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియోలు, ఫొటోలను ఓపెన్ సోర్స్ అనలిస్టులు విశ్లేషించి, నీడలు, వాతావరణం, ఇతర అంశాలనుబట్టి ఇవి అంతకుముందు జరిగిన పరీక్షకు సంబంధించినవని నిర్థరించారు. బహుశా ఇవి మార్చి 16న విఫలమైన ప్రయోగానికి సంబంధించినవి అయి ఉండవచ్చునని తెలిపారు. 


దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఆ దేశ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో, మార్చి 16న నిర్వహించిన ప్రయోగం విఫలమవడంతో ఉత్తర కొరియా నేతలు విమర్శలను ఎదుర్కొన్నారని, వీటిని తిప్పికొట్టేందుకు, తక్కువ కాలంలోనే విజయం సాధించామని చెప్పుకునేందుకు మార్చి 24న మరో పరీక్ష చేశారని తెలిపింది. 2017లో విజయవంతంగా ప్రయోగించిన Hwasong-15ను మరోసారి పరీక్షించారని తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా, అంతర్జాతీయ సమాజం ముందు తాను సైనికపరంగా శక్తిమంతంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు ఉత్తర కొరియా తాపత్రయపడుతోందని, ఇది కూడా ఈ పరీక్ష చేయడానికి మరొక కారణమని తెలిపింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.