ఐఐటీహెచ్‌తో దక్షిణకొరియా ఫార్మ్‌కాడ్‌ సంస్థ ఒప్పందం

ABN , First Publish Date - 2021-07-24T05:41:08+05:30 IST

కొత్త ఔషదాల సహా అభివృద్ధి కోసం ఉత్తమ పరిశోధన ఫలితాలను సాధించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌, దక్షిణకొరియాలోని ప్రముఖ ఫార్మ్‌కాడ్‌, సిలికో, డ్రగ్‌ డిజైన్‌ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా శుక్రవారం ఒప్పందం శుక్రవారం కుదుర్చుకున్నాయి.

ఐఐటీహెచ్‌తో దక్షిణకొరియా ఫార్మ్‌కాడ్‌ సంస్థ ఒప్పందం
ఒప్పంద పత్రాలను చూపుతున్న ఫార్మ్‌కాడ్‌ సీఈవో తహేయుంగ్‌ క్వాన్‌, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీ.ఎస్‌. మూర్తి

కంది, జూలై 23 : కొత్త ఔషదాల సహా అభివృద్ధి కోసం ఉత్తమ పరిశోధన ఫలితాలను సాధించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌, దక్షిణకొరియాలోని ప్రముఖ ఫార్మ్‌కాడ్‌, సిలికో, డ్రగ్‌ డిజైన్‌ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా శుక్రవారం ఒప్పందం శుక్రవారం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ.ఎ్‌స.మూర్తి, ఫార్మ్‌కాడ్‌ సీఈవో తహేయుంగ్‌ క్వాన్‌ ఉమ్మడి పరిశోధనల కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సహకారంతో కృత్రిమమేథతో సాంకేతికతను ఉపయోగించి పరిశోధనలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రెండు సంస్థలు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కొవిడ్‌- 19 ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫార్మ్‌కాడ్‌ సహకరించి ఆఫ్టిమైజ్‌ చేసింది. ఫార్మ్‌కాడ్‌ సంస్థ ప్రతినిధులు దక్షిణకోరియాలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ఐఎన్‌డీ (ఇన్వెస్టిగేషనల్‌ న్యూ డ్రగ్‌) కోసం ఇటీవల దరఖాస్తు చేశారు. బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీలో ఐఐటీహెచ్‌ సమాజంలోని గొప్ప సవాళ్లను ఎదుర్కొవడానికి పరిశోధనల్లో బలమైన శక్తిగా ఐఐటీహెచ్‌ స్ధిరపడిందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీ.ఎస్‌. మూర్తి పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఐఐటీహెచ్‌ తన శక్తి సామర్థ్యాలను నిరంతరం నూతన సాంకేతకతను ఉపయోగిస్తుందని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-07-24T05:41:08+05:30 IST