జిల్లాపై నైరుతి అనుకూల ప్రభావం

ABN , First Publish Date - 2021-10-04T05:50:00+05:30 IST

నైరుతి రుతుపవనాలు జిల్లాపై అనుకూల ప్రభావం చూపాయి. జిల్లా అంతటా గత నాలుగు నెలలుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

జిల్లాపై నైరుతి అనుకూల ప్రభావం

సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 3: నైరుతి రుతుపవనాలు జిల్లాపై అనుకూల ప్రభావం చూపాయి. జిల్లా అంతటా గత నాలుగు నెలలుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 439.4 మి.మీ కాగా 655.5 మి.మీ వర్షం కురిసింది. అంటే 49.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాగా, గడిచిన 24 గంటల్లో 26 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా ఎస్‌ఆర్‌పురంలో 33మి.మీ, మదనపల్లెలో 23.6, వరదయ్యపాళ్యంలో 18.4, ఐరాలలో 16, ఏర్పేడులో 13.4, గుడిపాలలో 12.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 20 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షం కురిసింది.

Updated Date - 2021-10-04T05:50:00+05:30 IST