దక్షిణాఫ్రికా నల్లజాతి విముక్తి ఉద్యమ నేత ఇబ్రహీం మృతి

ABN , First Publish Date - 2021-12-08T07:47:24+05:30 IST

దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఇబ్రహీం ఇస్మాయిల్‌ ఇబ్రహీం(84) అనారోగ్యంతో మృతిచెందారు. ...

దక్షిణాఫ్రికా నల్లజాతి విముక్తి  ఉద్యమ నేత ఇబ్రహీం మృతి

జొహన్నె్‌సబర్గ్‌, డిసెంబరు 7: దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఇబ్రహీం ఇస్మాయిల్‌ ఇబ్రహీం(84) అనారోగ్యంతో మృతిచెందారు. ఇబ్రహీం భారత సంతతికి చెందిన నేత. నెల్సన్‌ మండేలాతో కలిసి దక్షిణాఫ్రికాలోని రోబెన్‌ ఐలాండ్‌ జైలులో సుదీర్ఘకాలం శిక్ష అనుభవించారు. ఇబ్రహీం మృతి పట్ల ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) సం తాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలపై విధించిన నిషేధాన్ని ధిక్కరించినందుకు తండ్రిని అరెస్టు చేయడంతో 13ఏళ్ల వయసులోనే ఇబ్రహీం నల్లజాతి విముక్తి ఉద్యమంలో చేరారు. గాంధీ అనుసరించిన సత్యాగ్రహం తనకు స్ఫూర్తి అని చెప్పేవారు. 1963లో దక్షిణాఫ్రికా సర్కారు ఆయనను అరెస్టు చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు న్నారు.

Updated Date - 2021-12-08T07:47:24+05:30 IST