సోయా బీన్‌ ఆలూ కూర్మా

ABN , First Publish Date - 2021-10-13T17:34:50+05:30 IST

ఉల్లిగడ్డ ముక్కలు - రెండు కప్పులు, ఆలు గడ్డ ముక్కలు- కప్పు, సోయా చంక్స్‌- 100 గ్రాములు, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చీ- రెండు, ధనియాల పొడి, ఆవాల పొడి- చెరో స్పూను, కారం, పసుపు - అర స్పూను, గరమ్‌ మసాలా పొడి

సోయా బీన్‌ ఆలూ కూర్మా

కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ ముక్కలు - రెండు కప్పులు, ఆలు గడ్డ ముక్కలు- కప్పు, సోయా చంక్స్‌- 100 గ్రాములు, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చీ- రెండు, ధనియాల పొడి, ఆవాల పొడి- చెరో స్పూను, కారం, పసుపు - అర స్పూను, గరమ్‌ మసాలా పొడి- అర స్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, మిరియాలు- పది, చెక్క- ఒకటి, పెరుగు- అర కప్పు, టొమాటో ప్యూరీ- కప్పు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా సోయాను ఉడికించి నీళ్లన్నిటినీ తొలిగించి, నూనెలో వేయించి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, చెక్క, పచ్చి మిర్చి, మిరియాలు వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా జతచేయాలి. రెండు నిమిషాల తరవాత టొమాటో ప్యూరీ, పొడులు వేసి బాగా కలపాలి. ఆ తరవాత పెరుగు కూడా వేయాలి. అన్ని పదార్థాలు బాగా కలిసిపోయాక సోయా, ఆలూ ముక్కలు వేసి ఉప్పు వేసి మూతపెట్టాలి. రెండు విజిల్స్‌ తరవాత స్టవ్‌ కట్టేస్తే సోయా బీన్‌ ఆలూ కూర్మా రెడీ.

Updated Date - 2021-10-13T17:34:50+05:30 IST