ఆదివాసీ గూడెల్లో కరోనా సంరక్షణ చైతన్యయాత్ర

ABN , First Publish Date - 2021-05-09T04:40:33+05:30 IST

కరోనా సంరక్షణ యాత్రలో భాగంగా నిరుపేద, కరోనా బాధితులకు ఇవ్వడానికి ఆదివాసీ సంస్కృ తిని ప్రతిబింబించేలా తయారు చేసిన మాస్కులను శనివారం హైదరాబాద్‌లో అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరా వు ఆవిష్కరించారు.

ఆదివాసీ గూడెల్లో కరోనా సంరక్షణ చైతన్యయాత్ర
మాస్కులను ఆవిష్కరిస్తున్న దృశ్యం

అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు

భద్రాచలం, మే 8: కరోనా సంరక్షణ యాత్రలో భాగంగా నిరుపేద, కరోనా బాధితులకు ఇవ్వడానికి ఆదివాసీ సంస్కృ తిని ప్రతిబింబించేలా తయారు చేసిన మాస్కులను శనివారం హైదరాబాద్‌లో అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరా వు ఆవిష్కరించారు. ఈ నెల 13 నుంచి 31 వరకు జరిగే కరోనా సంరక్షణ చైతన్య యాత్రలో భాగంగా ఈ మాస్కుల ను ఆదివాసీ గూడేల్లో ప్రజలకు, కరోనా బాధితులకు పంపిణీ చేస్తామన్నారు. వాటితో పాటు రాగి పిండి, జొన్న పిం డి, ఏఈడబ్ల్యుసీఏ సభ్యులు దాతలు అందజేసే వస్తువులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో యాత్ర నిర్దేశకులు రామకృష్ణ, సుధారాణి, అట్టం కమల, రామలక్ష్మి, ఉమాదేవి, దుర్గ, వీరస్వామి, వసంత్‌, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:40:33+05:30 IST