దోపిడీ ముఠాను వెంటాడి పట్టుకున్న SP
ABN , First Publish Date - 2021-11-26T15:31:47+05:30 IST
దోపిడీ ముఠాను చూసిన ఎస్పీ వారిని వెంటాడి పట్టుకున్న సంఘటన వేలూరులో జరిగింది. స్థానిక గ్రీన్ సర్కిల్ సమీపం విష్ణుదుర్గ ఆలయం వద్ద గువ్వల వాళ్లు పచ్చబొట్లు వేస్తుండగా ఆ సమయంలో మోపెడ్‌పై
వేలూరు(చెన్నై): దోపిడీ ముఠాను చూసిన ఎస్పీ వారిని వెంటాడి పట్టుకున్న సంఘటన వేలూరులో జరిగింది. స్థానిక గ్రీన్ సర్కిల్ సమీపం విష్ణుదుర్గ ఆలయం వద్ద గువ్వల వాళ్లు పచ్చబొట్లు వేస్తుండగా ఆ సమయంలో మోపెడ్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని కత్తితో బెదిరించి రూ.1,200 నగలు లాక్కొని పరారయ్యారు. వారు నేషనల్ జంక్షన్ రోడ్డు మార్గంగా వెళుతుండగా, అక్కడకు కారులో వచ్చిన ఎస్పీ, మోపెడ్‌పై వెళుతున్న వారి చేతల్లో కత్తిని చూసి వెంటనే వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,200 నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక కత్తి, రెండు పెద్ద కత్తులను స్వాధీనం చేసుకున్నారు.