ఎస్పీకి బీజేపీ నుంచి సీట్లు బీఎస్‌పీ నుంచి ఓట్లు

ABN , First Publish Date - 2022-03-10T18:17:12+05:30 IST

ఈ ఎన్నికల్లో అధికారానికి ఎస్పీ దూరంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల కంటే ఓట్ల పరంగా సీట్ల పరంగా చాలా మెరుగైంది. ఓట్ల విషయంలో బీఎస్పీ నుంచి లబ్ది పొందితే.. సీట్లు బీజీపీ నుంచి లాగేసుకుందని ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం కొన్ని ఓట్లు ఎస్పీ వైపుకు వెళ్లినట్లు తెలుస్తోం..

ఎస్పీకి బీజేపీ నుంచి సీట్లు బీఎస్‌పీ నుంచి ఓట్లు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ పథంలో దూసుకుపోతోంది. అయితే గత ఎన్నికల ఫలితాలతో ఈ ఎన్నికల్లో ఫలితాలను విశ్లేషించుకుంటే కాస్త భిన్నంగా ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ బ్యాంకుతో ముందు వరుసలో ఉన్న బీజేపీకి ఈసారి ఓట్లు తగ్గుతాయని ఫలితాలు చెబుతున్నాయి. ఈ సీట్లను అనూహ్యంగా ఎస్పీ కైవసం చేసుకుంటోంది. ఇక గత ఎన్నికల్లో సీట్లు తక్కువగానే గెలిచినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించిన బీఎస్పీ.. ఈసారి ఓట్లు, సీట్లు రెండింటిలోనూ వెనుకబడిపోయింది. బీఎస్పీ కోల్పోయిన ఓట్ బ్యాంక్.. ఎస్పీకి టర్న్ అయిందని విశ్లేషకులు అంటున్నారు.


ఈ ఎన్నికల్లో అధికారానికి ఎస్పీ దూరంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల కంటే ఓట్ల పరంగా సీట్ల పరంగా చాలా మెరుగైంది. ఓట్ల విషయంలో బీఎస్పీ నుంచి లబ్ది పొందితే.. సీట్లు బీజీపీ నుంచి లాగేసుకుందని ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం కొన్ని ఓట్లు ఎస్పీ వైపుకు వెళ్లినట్లు తెలుస్తోంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 39.67%, బీఎస్పీ 22.23%, ఎస్పీ 21.82%, కాంగ్రెస్ 6.25% ఓట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వల్పంగా ఓట్ బ్యాంక్‌ను పెంచుకుని ప్రస్తుతం 42.4% ఓట్లతో దూసుకుపోతోంది. ఇక ఎస్పీ ఏకంగా పది శాతం ఎక్కువ ఓట్లు ఈసారి సంపాదించేట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 31.6% ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక బీఎస్పీ అత్యధికంగా ఓట్లను కోల్పోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం కేవలం 12.7% ఓట్లతో వెనకబడిపోయింది. కాంగ్రెస్ సైతం గత ఎన్నికలతో పోలిస్తే మరింత క్షీణించి 2.42% ఓట్లతో కొనసాగుతోంది.

Updated Date - 2022-03-10T18:17:12+05:30 IST