చోరీలు, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-08-19T06:02:53+05:30 IST

జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాలను నియం త్రించేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు.

చోరీలు, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో ఆదేశాలిస్తున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, పక్కన అదనపు ఎస్పీలు మహేష్‌, శ్రీనివాసరావు

నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ ఆదేశాలు

గుంటూరు, ఆగస్టు 18: జిల్లాలో దొంగతనాలు అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాలను నియం త్రించేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గ్రీవెన్స్‌ హాలులో జరిగిన నేరసమీక్షా స మావేశంలో ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్నాచింగ్స్‌ జరిగేందుకు వీలుగా ఉన్న ప్రదేశాలను, గతంలో ఎక్కువగా చైన్‌స్నాచింగ్‌ జరిగిన ప్రాంతా లను గుర్తించి అక్కడ విజుబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయాలన్నారు. అలాగే రాత్రి గస్తీ పటిష్టంచేసి అనుమానాస్పద వ్యక్తులను ఫింగర్‌ ప్రింట్‌ రివైజర్‌ ద్వారా తనిఖీ చేయాల న్నారు. రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులలో ఈఎన్‌ఏ, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు త్వరిగతిన తెప్పించుకోవాలన్నారు. మిస్సింగ్‌ కేసులు, అనుమానాస్పద మృతి కేసులు, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో తదితర కేసుల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి కోర్టుల్లో అభియోగపత్రాలు జారీ చేయాలన్నారు.  సీసీఎస్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మహేష్‌, డీఎస్పీలు సీతారామయ్య, పోతురాజు, స్రవంతిరాయ్‌, మో జెస్‌పాల్‌, డి.శ్రీనివాసరావు, కె.శేఖర్‌, రమణకుమార్‌, ఎస్‌బీ సీఐలు నరసింహారావు, శ్రీనివా సరావు, డీసీఆర్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:02:53+05:30 IST