SP leader అజాంఖాన్ జైలు నుంచి విడుదల

ABN , First Publish Date - 2022-05-20T13:04:37+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజాంఖాన్ దాదాపు 27 నెలల జైలు శిక్ష తర్వాత శుక్రవారం జైలు నుంచి విడుదల అయ్యారు....

SP leader అజాంఖాన్ జైలు నుంచి విడుదల

సీతాపూర్ (ఉత్తరప్రదేశ్):సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజాంఖాన్  దాదాపు 27 నెలల జైలు శిక్ష తర్వాత శుక్రవారం జైలు నుంచి విడుదల అయ్యారు.సుప్రీంకోర్టు అజాంఖాన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రాంపూర్ కోర్టు అతన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విడుదల ఉత్తర్వులను గురువారం రాత్రి సీతాపూర్ జైలుకు పంపారు. దీంతో శుక్రవారం సీతాపూర్ జైలు తెరవగానే అజాం ఖాన్ ను విడుదల చేశారు.అజాంఖాన్ కుమారుడు అబ్దుల్లా అజాం, శివపాల్ యాదవ్‌తో కలిసి సీతాపూర్ జైలు వద్దకు వచ్చారు.లక్ష రూపాయల బాండ్‌పై అజాంఖాన్‌ను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ఛీటింగ్ కేసులో ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆయన విడుదలకు మార్గం సుగమం చేసింది.ప్రస్తుత కేసులో వాస్తవాలు చాలా విచిత్రంగా ఉన్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం దాని అసాధారణ అధికారాన్ని అమలు చేయడం సరైనదని కోర్టు తీర్పు చెప్పింది.


Updated Date - 2022-05-20T13:04:37+05:30 IST