పురపాలక ఎన్నికలకు పటిష్ట నిఘా : ఎస్పీ

ABN , First Publish Date - 2021-02-28T07:00:46+05:30 IST

మార్చి 10వ తేదీన జరిగే పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు అన్నారు.

పురపాలక ఎన్నికలకు పటిష్ట నిఘా : ఎస్పీ

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : మార్చి 10వ తేదీన జరిగే పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు అన్నారు. ఎన్నికలలో తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపె ౖనూజివీడు, పెడన, తిరువూరు, నందిగామ ప్రాంతాల పోలీస్‌ అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా ఏఎస్పీ మల్లికాగర్గ్‌తో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.  సిబ్బంది కొరతను అధిగమిం చేందుకు మహిళా పోలీసుల సేవలను వినియోగించు కోవాల న్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ దళాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిం చాలన్నారు. ఏఎస్పీ మల్లికాగర్గ్‌ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలన్నారు.   సమస్యలు సృష్టించే వారిని బైండోవర్‌ చేయా లన్నారు.  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయా లన్నారు. ఎస్‌బీ డీఎస్పీ ధర్మేంద్ర, నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి,  నూజివీడు డీఎస్పీ పి.శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ మురళీకృష్ణ,  ఎస్‌బీ సీఐ నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T07:00:46+05:30 IST