ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-12-02T05:37:59+05:30 IST

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌, ఒమైక్రాన నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పేర్కొన్నారు.

ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి

జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, డిసెంబరు 1: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌, ఒమైక్రాన నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయన తన చాంబర్‌ నుంచి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న హోంగార్డుల నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారులు, సి బ్బందితో జూమ్‌ యాప్‌ ద్వారా కాన్ఫరెన్స నిర్వహించారు. కొ విడ్‌ థర్డ్‌ వేవ్‌, ఒమైక్రాన వచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉం డాలని దిశ నిర్దేశం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలు పక్కాగా పాటించాలన్నారు.  పోలీ సులకు వీక్లీ ఆఫ్‌లు, విధి ని ర్వహణ పనులతో పాటు వారి పిల్లలు, కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యం గా ప్రణాళిక బద్ధంగా సేవలందిస్తున్నట్టు పేర్కొన్నారు. పో లీసు పిల్లలకు స్పోకెన ఇంగ్లీషు, తదితర సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా సబ్‌ డివిజన స్థాయి ప్రాంతాల్లో మొబైల్‌ క్యాంటీనలు, అతి తక్కువ ధరలోనే నిత్యావసర సరుకులు, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు అందుబాటులో ఉం చుతామన్నారు. బుక్కరా య సముద్రం మండలం సిద్దరాంపురం గ్రామ సమీపం లోని పోలీసు స్థలాల్లో విద్యుత, నీటి,రోడ్లు తదితర  సౌక ర్యాలను కల్పిస్తామన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య సేవ లు తదితర పరీక్షలు సకాలంలో అందించేలా ఆయా డీఎస్పీల నేతృత్వంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా సిబ్బంది బదిలీల విషయంలో సీజన, రీజన ఉండ టంతో పాటు వచ్చే జూనలోపు ఐదేళ్లు పూర్తి అయిన వారికి పారదర్శకంగా బదిలీల అవకాశం కల్పిస్తామన్నారు.  


Updated Date - 2021-12-02T05:37:59+05:30 IST