నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-11-28T04:21:05+05:30 IST

జిల్లాలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీకాకుళం, పాలకొండ, పలాస డివిజన్‌ పోలీసులతో నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి




ఎస్పీ అమిత్‌బర్దర్‌  

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 27: జిల్లాలో మహిళలు, చిన్నారులపై  జరిగే నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీకాకుళం, పాలకొండ, పలాస డివిజన్‌ పోలీసులతో నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో త్వరతిగతిన దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్‌ చేయడమే కాకుండా.. సత్వరమే ఛార్జిషీటు కూడా వేయాలి. ప్రతి కేసు వివరాలు సీసీటీఎస్‌ అప్లికేషన్‌లో పొందుపరిస్తే సాంకేతికపరంగా పని సులభతరమవుతుంది. మోసపూరితమైన నేరాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. చోరీలు, ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు రాత్రివేళల్లో ప్రత్యేకగస్తీ చేపట్టాలి. ప్రొపర్టీ కేసుల్లో రికవరీని పెంచాల్సిందే. ఏటీఎం సెంటర్‌లు, బ్యాంకుల వద్ద గస్తీ ముమ్మరం చేయాలి. గ్రామాల్లో పరిస్థితులపై ఆరా తీస్తుండాలి. దత్తత గ్రామాల్లో పర్యటించి శాంతిభద్రతల సమస్యలను ముందుగానే ఊహించి కౌన్సెలింగ్‌ చేయాలి. మద్యం, గంజాయి అక్రమ రవాణా అరికట్టాలి. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో కలసి పోలీసులు పని చేయాలి. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా వాహనదారులకు అవగాహన పెంచుతూనే ఉండాలి. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నది మరువకూడదు’ అని హెచ్చరించారు. అవినీతి రహితంగా ప్రజలకు సేవచేయాలని.. పోలీసు కంట్రోల్‌ రూమ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌తో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రజాజీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు సోమశేఖర్‌, విఠలేశ్వరరావు, డీఎస్పీలు మహేంద్ర, శ్రావణ, మూర్తి, ప్రసాద్‌, వాసుదేవ్‌, శ్రీనివాసరావు, డీసీఆర్బీ, ఎస్‌బీ, ఎక్సైజ్‌ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 




Updated Date - 2020-11-28T04:21:05+05:30 IST