
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) సీనియర్ నేత అజాంఖాన్(Azam Khan)కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ (Bail) మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం ప్రకటించింది. చీటింగ్ కేసులో జైలు పాలైన ఆయనకు రెగ్యూలర్ బెయిల్పై నిర్ణయం తీసుకునే వరకు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 142 అధికారాన్ని ఉపయోగించుకుని కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. కొన్నిసార్లు చట్టాల ద్వారా న్యాయ పరిహారం అందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పూర్తి న్యాయం చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం.. సుప్రీంకోర్టు అసాధారణ అధికారాలు ఉంటాయి. 78 కేసులు అజాంఖాన్పై నమోదు కాగా, 77 కేసుల్లో క్లీన్ చీట్ వచ్చింది. చివరి కేసులో తీర్పు చాలా కాలంగా రిజర్వులో ఉంది. ఈ కేసులో కూడా అజాంఖాన్కు క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. కాగా, ఈ కేసులో ఇంకా తుది తీర్పు రాకపోయినప్పటికీ.. మధ్యంతర బెయిల్ మాత్రం లభించడంతో తొందరలోనే ఆయన విడుదలకానున్నారు.
ఇవి కూడా చదవండి