SP supremo: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-10-10T15:25:10+05:30 IST

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్(Mulayam Singh Yadav) యాదవ్ సోమవారం కన్నుమూశారు....

SP supremo: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు(Samajwadi Party founder) ,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్(Mulayam Singh Yadav) యాదవ్ సోమవారం కన్నుమూశారు.గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8.30 గంటలకు మరణించారు. 82 ఏళ్ల వయసున్న ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వతేదీన ఆసుపత్రిలో చేరారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయంసింగ్ గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1939 నవంబర్ 22వతేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ ఈయన పనిచేశారు. 


ములాయం1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి  ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ములాయంసింగ్‌ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్.రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌యాదవ్ లోహియా. సీనియర్ నేత దివంగత రాజ్‌నారాయణ్‌ స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారు. 


Updated Date - 2022-10-10T15:25:10+05:30 IST