వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను విజిట్‌ చేసిన ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-27T04:54:07+05:30 IST

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు.

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను విజిట్‌ చేసిన ఎస్పీ
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 26 : వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను  జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. స్టేష న్‌లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌లో కేసుల వివరాలు, పెం డింగ్‌ కేసుల వివరాలను ఆరా తీశారు. స్టేషన్‌లో స్వచ్ఛతను పరిశీ లించారు. ఫిర్యాదుదారులను ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు ? రికార్డ్‌లను ఎలా మెయింటేన్‌ చేస్తున్నారు అని అడిగి తెలుసుకు న్నారు. ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేయవద్దని ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిం చాలని కోరారు. స్టేషన్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. పచ్చదనం పెంపొందించుకో వాలని సూచించారు. వన్‌టౌన్‌ స్టేషన్‌ పనితీరుపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కిషన్‌, సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T04:54:07+05:30 IST