ప్రతి సోమవారం ప్రగతిపై సమీక్ష

ABN , First Publish Date - 2021-07-27T04:42:02+05:30 IST

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు సమీక్షించనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

ప్రతి సోమవారం ప్రగతిపై సమీక్ష

‘స్పందన’ అర్జీలన్నీ పరిష్కరించాలి : కలెక్టర్‌ 


నెల్లూరు (హరనాథపురం), జూలై 26 : ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు సమీక్షించనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. సోమవారం కలెక్టర్‌ బంగ్లాలో కార్పొరేషన్ల అధికారులతో ఆయన సమీక్షించారు. అధికారులందరూ ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు. డీఆర్‌డీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలను మంజూరు చేయాలని ఆదేశించారు.  బియ్యం పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగష్టు 7 నాటికి వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని పూర్తి చేయడంతోపాటు జగనన్న భూసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. స్పందనతోపాటు కార్యాలయాల్లో అందచేసిన అర్జీలలో నిర్ణీత గడువుకు మించి ఒక అర్జీ కూడా అపరిష్కృతంగా ఉండరాదని సూచించారు. రెండోదశ కొవిడ్‌కు సంబంధించి బిల్లులన్నీ ఆడిట్‌ చేయాలని అన్నారు.  కొవిడ్‌ మూడోదశఽను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీలు హరేందిరప్రసాద్‌, విదేహ్‌ఖరే, గణేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు ఏర్పాట్లు 


జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ కోసం భూసేకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు చెప్పారు. సోమవారం ఆ హార్బన పురోగతిపై ఆదిత్యనాథ్‌దాస్‌ వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. హార్బర్‌కు 76.89 ఎకరాలు అవసరముండగా, 38.53 ఎకరాలను మత్స్య శాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఇంకా 6.93 ఎరకాల చుక్కల భూమికి సంబంధించి ఫామ్‌-1 జారీ చేసినట్లు తెలిపారు. 38.53 ఎకరాల అసైన్డ భూమికి సంబంధించి సుమారు రూ.2.6 కోట్లను లబ్ధిదారులకు నష్టపరిహారంగా చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఈ సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్‌,  శిక్షణ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ఖాన, మత్స్యశాఖ జేడీ ఎం. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:42:02+05:30 IST