ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

ABN , First Publish Date - 2022-01-18T05:44:04+05:30 IST

స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, జనవరి 17 : స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా మేయర్‌కు అందజేశారు. మొత్తం 13 అర్జీలు వచ్చాయి.  సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్ధాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మేయర్‌ అధికారులకు సూచించారు. అదనపు కమిషనర్‌ జె.అరుణ, చీఫ్‌ మెడికల్‌ ఆఽపీసర్‌ గీతాభాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కూలిన రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించాలని వినతి

50వ డివిజన్‌ గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం కూలిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని, ప్రమాదకరంగా ఉన్న రిటైనింగ్‌ వాల్‌కు మరమ్మతులు నిర్వహించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ రూమ్‌లో జరిగన స్పందనలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. సీపీఎం నగర కమిటీ సభ్యులు పీ.రాజు, డివిజన్‌ నాయకులు జి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:44:04+05:30 IST