నేడు విద్యుత్‌ స్పందన

ABN , First Publish Date - 2021-11-29T06:29:49+05:30 IST

నేడు విద్యుత్‌ స్పందన

నేడు విద్యుత్‌ స్పందన

విజయవాడ సిటీ, నవంబరు 28: రాజ్‌భవన్‌ సమీపంలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో  సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు విజయవాడ టౌన్‌, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బి.వి. సుధాకర్‌ ఆధివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ టౌన్‌ డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారుల.. విద్యుత్‌ ఓల్టేజ్‌లో హెచ్చు తగ్గులు, విద్యుత్‌ మీటర్‌లోని లోపాలు, విద్యుత్‌ బిల్లుల్లో పొరపాట్లు తదితర సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.

Updated Date - 2021-11-29T06:29:49+05:30 IST